ప్రాంతీయం

అంజనీపుత్ర వినాయకుడునీ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

12 Views

అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడునీ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.

మంచిర్యాల జిల్లా కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో  భాగంగా నేడు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, పట్టణంలోని అంజనీపుత్ర గణేష్ మండలిని సందర్శించారు. అక్కడ కొలువుదీరిన విఘ్నేశ్వరుడిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.మండపానికి చేరుకున్న కలెక్టర్ కుమార్ దీపక్‌కు నిర్వాహకులు, వేద పండితులు ఘన స్వాగతం పలికారు. స్వామివారికి పట్టువస్త్రాలు, ఫలాలు సమర్పించిన కలెక్టర్, దేశప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు కలెక్టర్‌కు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి, వేదాశీర్వచనం అందించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో, ఆధ్యాత్మిక శోభతో జరుపుకోవాలని సూచించారు. నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి అధికారులు, మండలి నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అన్ననిపుత్ర మండప నిర్వాహకులు గుర్రాల శ్రీధర్ తోపాటు, స్థానిక నాయకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

 

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *