వరసిద్ధి వినాయకుడికని దర్శించుకున్న
ఆర్‌డీఓ శ్రీనివాసరావు.
అంజనీపుత్ర ఎస్టేట్ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుని ఉత్సవాలు, స్వామివారికి ప్రత్యేక పూజలు. ఉత్సవాల నిర్వహణకు ప్రశంసలు
మంచిర్యాల,సెప్టెంబర్ 18
పట్టణంలోని చున్నంబట్టివాడ 100 ఫీట్ రోడ్డులో అంజనీపుత్ర ఎస్టేట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరసిద్ధి వినాయకుడిని మంచిర్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసరావు శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆర్‌డీఓ మాట్లాడుతూ అంజనీపుత్ర ఎస్టేట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కాలనీవాసులంతా ఐక్యంగా ఒకచోట చేరి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో ఐకమత్యం, సోదరభావాన్ని పెంపొందించడంతోపాటు ప్రశాంత వాతావరణానికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు.గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తొమ్మిది రోజులపాటు నిరంతరంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సమాజంలో ఐక్యత, సద్భావన మరింత పెరుగుతాయని ఆకాంక్షించారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులు,ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీవాసులు, భక్తులను అభినందించారు.
ఈ పవిత్ర కార్యక్రమంలో తనను భాగస్వామిని చేసి స్వామివారి సేవలో పాల్గొనే అవకాశం కల్పించిన అంజనీపుత్ర ఎస్టేట్ చైర్మన్ గుర్రాల శ్రీధర్‌కు ఆర్‌డీఓ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అంజనీపుత్ర ఎస్టేట్ నిర్వాహకులు, కాలనీ పెద్దలు,ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.





