ముస్తాబాద్, సెప్టెంబర్ 18 (24/7 న్యూస్ ప్రతినిధి): భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పిలుపునిచ్చిన ఆశీర్వాద దీపం కార్యక్రమంలో భాగంగా స్థానిక శివ కేశవ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రధాని
మోదీ బలమైన నాయకత్వంలో భారతావని అభివృద్ధి, సంక్షేమ పథంలో మరింత శ్రేష్ఠంగా పురోగమించాలని, ఆయన దీర్ఘాయుష్మాన్ భవుడై నూరేళ్లు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తూ నాయకులు ఆశీర్వాద దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మల్లారపు సంతోష్ రెడ్డి, వార్డు మెంబర్ మార్గాల వేణు, కామిటిగారి పద్మ, నాయకులు మెంగని మహేందర్, వీటి సత్తయ్య, ఓరగంటి సత్యం, తెర్లుమద్ది యాదగిరి, రంజాన్ వెంకటేష్, అనిల్, నరసింహచారి, గడ్డమీద వినయ్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.




