ప్రాంతీయం

రాజ్యాధికారం సాధన ద్వారానే దళిత బహుజన కులాలకు విముక్తి, దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్

18 Views

రాజ్యాధికారం సాధన ద్వారానే దళిత బహుజన కులాలకు విముక్తి, దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్

బెల్లంపల్లి, సెప్టెంబర్17 (తెలుగు న్యూస్): రాజ్యాధికారం సాధన ద్వారానే దళిత బహుజన కులాలు విముక్తి అవుతారని దళిత బహుజన పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే దళితుల రక్షణ రాజ్యాధికార సాధన సభలు పాదయాత్రలలో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొని బెల్లంపల్లి తిలక్ స్టేడియం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు పాదయాత్ర నిర్వహించి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కృష్ణ స్వరూప్ మాట్లాడుతూ, 79 సంవత్సరాల స్వతంత్ర భారతావని లో దళిత బహుజన సమాజమే ప్రధానoగా తెలంగాణ ప్రాంతంలో విద్రోహo నకు గురయ్యారని, సామాజిక అన్యాయానికి గురయ్యారని తెలిపారు. మనువాద మాఫియా పాలనలో దళితులకు రక్షణ ఉండదని తెలిపారు. దెక్కన్ తెలంగాణలో 1948 నుండి నేటి వరకు దళిత సమాజం అంతా విద్రోహనికి గురయ్యారని, నేటికి అన్యాయం జరుగుతున్న పీడిత ప్రజలు వీరేనని అన్నారు. దోపిడీ కులాల రాజ్యాన్ని అంతం చేయాలని, రాజ్యాధికారాన్ని దళిత బహుజనులు హస్తగతం చే సుకోవాలని,రాజ్యాధికారంలోరాని దళిత కులాలు, జాతులకు భవిష్యత్తు ఉండదని, సామాజిక బానిసత్వం తప్పదని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశయాల సాధన కోసం రాజకీయ, సామాజిక పోరాటం చేస్తున్న దళిత బహుజన పార్టీ ప్రతినిధులను చట్టసభలు అసెంబ్లీ పార్లమెంటులకు పంపించవలసిన బాధ్యత దళిత బహుజన సమాజం మీద ఉందన్నారు. రెండు శాతం లేని బ్రాహ్మణ, పటేల్ పట్వారి, దేశముఖ భూస్వామ్య దోపిడీ కులాలు కాంగ్రెస్,బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు సెప్టెంబర్ 17 న రాజకీయ గ్రామాలు ఆడుతున్నారని, దళితులను రాజ్యాంగంలో రానీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పార్టీ పిలుపుమేరకు మన ఓటు మన రాజ్యం అనే నినాదం తోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ప్రజా చైతన్య సభలు విజయవంతం చేయాలని కృష్ణ విజ్ఞప్తి వేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పైన అవమానకర వ్యాఖ్యలు, అసత్య పుస్తకాలు రాయడం వెనుక ఆర్ఎస్ఎస్, బీజేపీ పార్టీ ల మనువాదల హస్తం ఉన్నదని, వారిపైన రాజద్రోహం కింద కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ యాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ ను కృష్ణ స్వరూప్ డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో డి బి పి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పులి రాజారామ్, పార్టీ రీజనల్ ఇంచార్జ్ పి.రాజలింగం, రాష్ట్ర ఆర్గనైజషన్ కార్యదర్శి పిట్టల ఈశ్వర్, పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ నిచ్చికోల రాంచందర్, మంచిర్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరెపల్లి నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి రవికుమార్, నాయకులు చిప్పరి కరుణాకర్, ఎ.రాజన్న, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు దయాకర్ పాటిల్, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు దాసరి బుచ్చన్న, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు వేముల రాజన్న, నాయకులు గద్దల తిరుపతి, ముల్కల్ల శంకర్, ఏల్పుల శంకర్, గంధం శంకర్, దుగుట రాజ్ కుమార్, మెరుగు రాజేశ్వర్, ఎస్సీ ఎస్టీ రాష్ట్ర అడ్వకేట్ ఫోరం కన్వీనర్ పసుల రాజు, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *