Breaking News ప్రకటనలు ప్రాంతీయం

బండలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఎల్లాగౌడ్ ఎన్నిక

8 Views

బండలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ

అధ్యక్షుడిగా ఎల్లాగౌడ్ ఎన్నిక

 

రెండు రోజులలో ప్రకటిస్తామని రెండు గంటలలో ప్రకటించిన మండల అధ్యక్షుడు 

 

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

సంగీతం శ్రీనివాస్ కు ఫిర్యాదు    ఎల్లారెడ్డిపేట ఆగస్టు 24 :

     ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షునిగా అబ్బ గోని ఎల్లా గౌడ్ ఎన్నికైనట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూడిది రాజేందర్ సోమవారం ప్రకటించారు,

      మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూడిది రాజేందర్ అద్యక్షతన బండలింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది,

ఈ సమావేశంలో గ్రామ శాఖ అద్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించగా మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు బాలరాజు రమేష్ గౌడ్, హైమద్ బాయ్ అబ్బగోని ఎల్లా గౌడ్ లు బరిలో నిలిచారు, కాగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ కు బరిలో ఉన్న నలుగురి పేర్లు లిస్ట్ ఇస్తామని  

రెండు రోజులలో గ్రామ శాఖ అధ్యక్షుని పేరు ప్రకటిస్తామని చెప్పి సమావేశాన్ని ముగించుకొని వెళ్ళి మండల కేంద్రంలో రెండు గంటల్లోనే అధ్యక్ష బరిలో ఉన్న తనకు చెప్పకుండా గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో గ్రామ శాఖ అధ్యక్షుని ప్రకటించకుండా రెండు గంటలలోనే ఎల్లా గౌడు ను ఏకపక్షంగా మండల అధ్యక్షుడు రాజేందర్ మండల కార్యాలయంలో ఎలా ప్రకటిస్తారని ఆయన ప్రకటించారని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇమామ్ బాయ్ ఆరోపిస్తున్నారు, గతంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అద్యక్షునిగా గౌడ సామాజిక వర్గానికి చెందిన రమేష్ గౌడ్ కు అవకాశం ఇచ్చి మళ్ళీ గ్రామ శాఖ అద్యక్ష పదవి గౌడ సామాజిక వర్గానికి ఇవ్వటం ఏమీటని ,

 ఈ విషయమై 

మండల అధ్యక్షున్ని అడగడానికి రెండు మూడు సార్లు ఫోన్ చేసినా ఎత్తలేదని

 దీనిపై జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ తో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదు చేసినట్లు హిమాంబాయి తెలిపారు, అన్ని గ్రామాలలో ఇదేవిధంగా చేస్తే కాంగ్రెస్ పార్టీ కి నష్టం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు,

 ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి తిమ్మాపూర్ ఉప సర్పంచ్ దేవేందర్ గారు సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఇలియాస్ బండలింగం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రమేష్ గౌడ్, సీనియర్ నాయకులు బాలు యాదవ్, హైమాద్ భాయ్, లక్ష్మారెడ్డి దడిగేల , ఆకారం రాజు, మార్పు సంజీవ రెడ్డి తది తరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *