ప్రాంతీయం

పేద ప్రజలకు వైద్య సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం- రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు

6 Views

పేద ప్రజలకు వైద్య సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలం- రఘునాథ్ వెరబెల్లి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు

*మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఈరోజు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి గారు బీజేపీ శ్రేణులతో కలిసి సందర్శించి శిథిలవస్థ స్థితిలో ఉన్న వివిధ వార్డులను పరిశీలించి మరియు ఆసుప్రతిలో అందిస్తున్న సదుపాయాలు ను పేషెంట్స్ ని అడిగి తెలుసుకోవడం జరిగింది.*

ఈ సందర్భంగా రఘునాథ్ గారు మాట్లాడుతూ ఎప్పడు ఏ వైపున స్లాబ్ కూలి ప్రమాదం జరుగుతుందో అనే భయంతో వైద్యులు, సిబ్బంది మరియు రోగులు ఉన్నారని తెలిపారు. ఆసుపత్రికి మరమత్తులు చేసి మరియు మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రతి వార్డులో కూడా స్లాబ్ పెచ్చులు ఊడి పడుతున్న కనీసం మరమత్తులు కూడా చేయలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. డయాలసిస్ వార్డులో మరి దారుణంగా స్లాబ్ కు మెష్ కట్టి వైద్యం కల్పించడం మరి దారుణంగా ఉందని అన్నారు. అదే విధంగా సరిపడా వైద్యులు మరియు సిబ్బంది లేక ఇక్కడ శస్త్ర చికిత్సలు చేయలేని పరిస్థితి ఏర్పడి పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కాలేజ్ రోడ్ లో నిర్మాణం పూర్తి చేస్తున్న భవనంలోకి ఆసుప్రతికి త్వరగా మార్చి అన్ని రకాల వైద్య సదుపాయాలు మరియు మౌలిక వసతులు ప్రజలకు కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అమిరిశెట్టి రాజ్ కుమార్, రంగ శ్రీశైలం, కుర్రె చక్రవర్తి, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, బొట్ల సత్యం, డేగ బాపు, పచ్చ స్వప్న, ఆడే ప్రేమ్ సింగ్, నాంపల్లి శ్రీనివాస్, పల్లి రాకేష్, పుదారి రాంచందర్, బింగి ప్రవీణ్, తూటి సరస్వతి, కొండ వెంకటేష్, బూర్ల చిరంజీవి మరియు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *