ముస్తాబాద్, ఆగస్టు 25 (24/7న్యూస్ ప్రతినిధి): తెలంగాణ వన మహోత్సవంలో భాగంగా తెర్లుమద్ది గ్రామంలో ప్రతి ఇంటికి పండ్ల, పూల మొక్కలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామాన్ని పచ్చదనంతో నింపాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సౌజన్య, వార్డు
సభ్యులు అంతడుపుల దేవయ్య, మంజుల, కొమ్మెట రాజలింగయ్య, కొమ్మెట రాజు, మామిండ్ల కానుకవ్వ, శ్రీనివాస్ పాల్గొని మొక్కల పంపిణీ చేశారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలను స్వీకరించారు. సర్పంచ్ బైతి దుర్గమ్మ, సీనియర్ నాయకులు నవీన్ మాట్లాడుతూ ప్రతి ఇంటివద్ద పండ్ల, పూల మొక్కలు పెంచి పచ్చదనాన్ని పెంపొందించాలని, వన మహోత్సవం ద్వారా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెరుగుతుందని ఆరోపించారు.




