13 Views
ముస్తాబాద్, ఆగస్టు 8 (24/7న్యూస్ ప్రతినిధి): దుబ్బాక నుండి ముస్తాబాద్ కు వచ్చే ప్రధాన రోడ్డు పూర్తిగా గుంతల మయంగా మారింది. చినుకు పడితే బురదతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారు. ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు కొమ్మాడ రాజు మాట్లాడుతూ ఇటు కేంద్రం అటు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? రోడ్లు బాగు చేయరు, బస్సులు నడపరు. దుబ్బాక-ముస్తాబాద్ కు అరగంటకొక బస్సు ఉండేది ఈరోజు ఆ బస్సు కూడా బంద్. ఓట్ల కోసం వచ్చి అభివృద్ధి అని గొప్పలు చెప్పారు. ఇప్పుడు ప్రజల కష్టాలు పట్టించుకునే నాథుడే లేడు. ఈ రోడ్డుపై రోజూ వేలాది విద్యార్థులు, రైతులు, కూలీలు కష్టపడుతున్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ప్రజలు నరకం చూస్తున్నారు. ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తుంది. వీలైనంత త్వరగా ఈ

రోడ్డును నిర్మించాలి. లేకుంటే భారీ ఎత్తున రాస్తారోకో చేపడతాం చేపడుతామని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కొమ్మాటరాజు మండిపడ్డాడు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘాల ఆర్గనైజర్ సెక్రెటరీ చుంచు మల్లయ్యతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.
Poll not found