ప్రాంతీయం

ఏఐసీసీ, టీపీసీ‌సీ పిలుపు మేరకు నీట్ పేపర్ లీక్ ఘటన, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జీని నిరసిస్తూ మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

7 Views

మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

మంచిర్యాల

ఏఐసీసీ, టీపీసీ‌సీ పిలుపు మేరకు నీట్ పేపర్ లీక్ ఘటన, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జీని నిరసిస్తూ మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో గాంధీ పార్క్ నుంచి అంబేద్కర్ చౌరస్తా (ఐబీ) వరకు ఈ ర్యాలీ కొనసాగింది.విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించిన కాంగ్రెస్ నాయకులు, విద్యా వ్యవస్థలో పారదర్శకతను కాపాడాలని, విద్యార్థుల హక్కులను రక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూముల నరేష్ , మేయర్ దర్ని మధుకర్ , టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, పూదరి తిరుపతి  , కార్పొరేటర్లు నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *