

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గా సూడిద రాజేందర్ కు నియామక పత్రం అందజేసిన డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్
TS తెలుగు న్యూస్ 24/7: సిరిసిల్ల జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ అధ్యకతన జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నూతనంగా వేసిన కమిటీల అభ్యర్థులకు నియామక పత్రాలను పంపిణీ చేశారు.అందులో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గా సూడిద రాజేందర్ కు డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ ల చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా సూడిద రాజేందర్ మాట్లాడుతూ నా పై నమ్మకం ఉంచి పార్టీ అధిష్టానం అప్పగించిన బాధ్యతలకు న్యాయం చేస్తానని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.తన నియామకానికి సహకరించిన మండల,జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. మండల కేంద్రానికి చెందిన వంగ గిరిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామక పత్రం అందుకొన్నారు.





