
కరీంనగర్ డిసిసి అధ్యక్షులు,చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూడిద రాజేందర్
TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూడిద రాజేందర్ తాను అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టినందుకుగాను ఈ ప్రాంత వాసి అయిన కరీంనగర్ డిసిసి అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ను కరీంనగర్ లోని వారి నివాసంలో సోమవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు.అనంతరం ఎమ్మెల్యే సత్యం రాజేందర్ ను శాలువాతో సత్కరించి అభినందిస్తూ పార్టీకి మీరు చేసిన సేవలను గుర్తించి పార్టీ మీకు ఇచ్చిన బాధ్యతలను రెట్టింపు ఉత్సాహంతో నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.ఈ సందర్భంగా మండల అభివృద్ధిలో గానీ పార్టీ బలోపేతానికి గాని తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే తెలిపినట్లుగా సూడిద రాజేందర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు గుర్రాల రాజిరెడ్డి,భాస్కర్,జాదవ్,మేడిపల్లి దేవానందం తదితరులు పాల్గొన్నారు.





