మార్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామంలో ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మహిళ మృతి
సిద్దిపేట్, మర్కుక్, జులై 16, తెలుగు న్యూస్ 24/7
మార్కుక్ మండలం, పాములపర్తి గ్రామానికి చెందిన రుద్రారం యెల్లమ్మ, ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆమె చిన్న కుమార్తె రుద్రారం శ్రీలత, (36 సంవత్సరాలు) పోలియో కారణంగా చిన్ననాటి నుంచే శారీరక వైకల్యంతో బాధపడుతూ ఇంటి వద్దే నివసిస్తూ అప్పుడప్పుడు ఇంటి పనులు చేసుకుంటూ ఉండేది. ఉదయం సుమారు 7:00 గంటలకు ఫిర్యాదుదారు ఆమె భర్త పశువుల పాకకు వెళ్లి పాలు పితికే పనులు ముగించుకుని ఉదయం 8:00 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు. ఇంట్లోకి వెళ్లిన తర్వాత కుమార్తె కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతకగా ఇంటి ఆవరణలో ఉన్న నీటి సంపులో పడిపోయినట్లు గుర్తించారు.వెంటనే పొరుగువారు మరియు కుటుంబ సభ్యుల సహాయంతో ఆమెను నీటి సంపు నుండి బయటకు తీసి చూడగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.ప్రాథమిక సమాచారం ప్రకారం, శ్రీలత చిన్న మోటారు పైపును సంపు పైపుకు అమర్చే ప్రయత్నంలో శారీరక వైకల్యం కారణంగా కాలు జారి నీటి సంపులో పడిపోవడంతో ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎటువంటి అనుమానాస్పద పరిస్థితులు లేదా ఇతరుల ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదుదారు అనుమానం వ్యక్తం చేయలేదు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, గజ్వేల్ మార్చురీకి తరలించగా, ఫిర్యాదు మేరకు మార్కుక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.





