ప్రాంతీయం

హైమాక్స్ లైట్లు ప్రారంభించిన అధ్యక్షులు గజ్జల రాజు…

9 Views
ముస్తాబాద్ జూలై 15 (24/7న్యూస్ ప్రతినిధి): మండలంలోని బంధనకల్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 5 హైమాక్స్ లైట్లను ఏళ్ల బాల్ రెడ్డి గ్రామస్తుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజ్జెల రాజు చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గజ్జలరాజును బంధనకల్ గ్రామస్తులు మర్యాదపూర్వకంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా గజ్జలరాజు మాట్లాడుతూ హైమాక్స్ లైట్ల ఏర్పాటుకు కృషి చేసిన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటూ
ప్రజాపాలనలో భాగంగా బంధనకల్ గ్రామాన్ని అభివృద్ధిలో ముందు ఉంచుతామన్నారు.  కార్యక్రమంలో గుండెల్లి శ్రీనివాస్, రంజిత్, తుపాకుల శ్రీనివాస్, ఉచ్చిడిబాల్ రెడ్డి, మాజీ విద్యా కమిటీ చైర్మన్ కస్తూరి శ్రీనివాస్ రెడ్డి, బండారి సాయి, పొన్నం రాజయ్య, జెల్ల వెంకటస్వామి, నరేష్, రాములు, కనకయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు బదనకల్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *