రామ నామాన్ని లిఖించి, గోటి తలంబ్రాలు అందించిన భక్తుడు
సీతారాముల చిత్ర పఠాన్ని అందించి సన్మానించిన రామకోటి సంస్థ
ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి పుట్టినరోజు సందర్బంగా శుక్రవారం నాడు ఘనంగా సన్మానించి సీతారాముల చిత్ర పఠాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత, శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా కూడా రామ నామాన్ని లిఖించే వారని తెలిపారు. అదే విదంగా భద్రాచల రామయ్య కళ్యానానికి గోటి తలంబ్రాలు ప్రతి సంవత్సరం అందించి రామభక్తిని చాటుకున్న మహా భక్తుడని కొనియాడారు. రాజకీయంగా ఎంత ఎదిగినా కూడా ప్రతి వ్యక్తిపై ప్రేమ ఆప్యాతను చూపించే మహావ్యక్తి యాదవరెడ్డి అన్నారు.





