Breaking News

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత

16 Views

– సర్పంచ్ నర్ర కనకయ్య

గజ్వేల్ నియోజకవర్గం జూన్ 30 (ప్రజా ప్రతిభ):

జగదేవపూర్ : పరిసరాల‌ను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వీధుల్లో చెత్త వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని పలుగు గడ్డ గ్రామ సర్పంచ్ నర్ర కనకయ్య ప్రజలకు సూచించారు. మంగళవారం మండలంలోని పలుగు గడ్డ గ్రామం లో పర్యటించి పరిసరాలను పరిశీలించారు,
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరీ ఇంటి చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు,వర్షాకాలంలో ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ మొదలగు జ్వరాలు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ వీధుల్లో చెత్త, మురుగు కాలువలు శుభ్రంగా ఉండేలా ఎప్ప‌టిక‌ప్పుడు చూడాల‌ని ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ స్వప్న, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *