ప్రాంతీయం

మంచిర్యాల ప్రైవేట్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ లతో డిఎంహెచ్వో సమీక్ష సమావేశం

13 Views

జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల గైనకాలస్టులు తో ఆసుపత్రులలో ప్రసవాలు లింగ నిర్ధారణ పైన సమీక్ష చేయడం జరిగినది.

మంచిర్యాల ప్రైవట్ హాస్పిటల్ గైనకాలజిస్టులతో డిఎంహెచ్ఓ అధికారి అనిత సమీక్ష సమావేశం.

మంచిర్యాల జిల్లా

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల గైనకాలస్టులు తో ఆసుపత్రులలో ప్రసవాలు లింగ నిర్ధారణ పైన సమీక్ష చేయడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని 29 మంది ప్రైవేట్ ఆస్పత్రుల గైనకాలజిస్ట్ స్త్రీ వ్యాధి నిపుణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల గైనకాలజిస్ట్ లందరూ సాధారణ ప్రసవాలకు ముందుండాలని సిజిరియన్లకు దూరం ఉండాలని సాధారణ ప్రసవాలే ముద్దు సిజేరియన్లు వద్దు అని నినాదంతో జిల్లాను ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యంగా మొదటి కాన్పుకు వచ్చే గర్భవతులకు సాధారణ ప్రసంగం చేయాలని ప్రసవ వివరములను గర్భవతుల వివరములను రోజువారీగా నమోదు చేయాలని ఆదేశించినారు అదేవిధంగా ప్రతి స్కానింగ్ కేంద్రంలో వివరములను అందుబాటులో ఉంచాలని పిసిపి ఎన్ డి టి యాక్ట్ ప్రకారం గా నడుచుకోవాలని ప్రతి గర్భవతికి చేసే స్కానింగ్ వివరములను ఎఫ్ ఎఫ్ ఫార్మేట్ లో నమోదు చేయాలని ఆదేశించినారు అదేవిధంగా ధరల పట్టికను అందిస్తున్న వైద్య సేవలు వివరములను గర్భవతులకు బాలింతలకు అందిస్తున్న వైద్య సేవలు వాటి వివరములను గోడపై అతికించాలి లింగ నిర్ధారణ చేయబడదు లింగ నిర్ధారణ గురించి అడిగిన వారికి చెప్పిన వారికి చట్టరీత్యా చర్య తీసుకున్న బడును ముఖ్యంగా కౌన్సిలింగ్ ద్వారా వైద్యులు తల్లికి తెలియజేయాలి అని ఆదేశించినారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ అరుణశ్రీ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎం సి హెచ్ డాక్టర్ అప్పల ప్రసాద్ ప్రోగ్రామ్ ఆఫీసర్ బుక్ వెంకటేశ్వర జిల్లా మాస్ మీడియా అధికారి ప్రశాంతి డిపిఓ ప్రవళిక భాగ్య డిడియంలో మరియు సీనియర్ నే గైనకాలజిస్ట్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *