మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం
మాజీ ప్రధాన మంత్రి,*భారత రత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 35 వ వర్ధంతిని పురస్కరించుకుని ఈ రోజు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సీసిసి కార్నర్ వద్ద మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ ,డిప్యూటీ మేయర్ శ్రీమతి సళ్ళ రమ్య మహేష్ తో కలిసి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మేయర్ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను,కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశం లో తీసుకువచ్చిన సంస్కరణలను, పేద,బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ఆయన తీసుకువచ్చిన పథకాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు స్థానిక కార్పొరేటర్లు, నస్పుర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నూకల రమేష్,అన్ని డివిజన్ ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మహిళా,యువజన ,మైనార్టీ,రిటైర్మెంట్ కాంగ్రెస్ నాయకులు,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.





