ప్రాంతీయం

మంచిర్యాల జిల్లా కలెక్టర్ ని కలిసిన జాగృతి నాయకులు

7 Views

మంచిర్యాల జిల్లా కలెక్టర్ ని కలిసిన జాగృతి నాయకులు.

మంచిర్యాల జిల్లా.

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు  కల్వకుంట్ల కవిత ను అరెస్టు చేయడాన్ని జాగృతి శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నారు. గత సోమవారం నాడు ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలో పేదల ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడాన్ని నిరసిస్తూ బాధితులను పరామర్శించడానికి వెళ్లిన కవితను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం కాంగ్రెస్ దిగజారుడుతనానికి నిదర్శనం. ఎన్నో సంవత్సరాలుగా ఖమ్మం జిల్లాలో పేదలు ఇండ్లు నిర్మించుకొని జీవిస్తున్న పేదల ఇండ్లను హైడ్రా పేరుతో నిర్ధాక్షణంగా కూలివేయడం సరైంది కాదు. రేవంత్ సర్కార్ రాజకీయ ప్రత్యర్థుల మీద మరియు బీద మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేసి ఇండ్లను కూల్చివేత కార్యక్రమాలు చేపడుతుంది. పెట్టుబడుదారులు వ్యాపారస్తులు వారికి అనుకూలమైన రాజకీయ నాయకులు బఫర్ జోన్లకు విరుద్ధంగా చెరువుల ఆక్రమించి వ్యాపార సముదాయాలను నిర్మిస్తే వాటి జోలికి వెళ్లకుండా కేవలం సామాన్య ప్రజలను హైడ్రా పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తుంది. పేదల పక్షాన పోరాడుతున్న కల్వకుంట్ల కవితక్క ను అడ్డుకొని అరెస్టులు కొనసాగిస్తుంది. వెంటనే మానుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా యూత్ ప్రెసిడెంట్ మేడి రాజ శేఖర్.ఆడ్లకొండ రవి గౌడ్ సోదరి సురేష్. పెద్దపల్లి వెంకటేశ్వర్లు. చిప్పకుర్తి సంపత్. శ్రీను. పాగిరి సంపత్. కామెర శ్రీను. చింటూ సంతోష్. కొత్తపల్లి వెంకటేష్. సత్యం తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *