నిబంధనలు పాటించండి, సురక్షితంగా ఇంటికి చేరుకోండి
సిద్దిపేట్ ఏప్రిల్, తెలుగు న్యూస్ 24/7
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా చేపట్టిన ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమంలో భాగంగా, సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి గ్రామంలో రోడ్డు భద్రతా గ్రామ సభ నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్సై విజయభాస్కర్ మరియు ఎస్సై మల్లేశం
ఆధ్వర్యంలో ఈ అవగాహన సదస్సు జరిగింది.గ్రామ అభివృద్ధిలో భాగంగా, గ్రామ సభ్యులతో కలిసి ప్రత్యేకంగా ‘విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీని, ఏర్పాటు చేశారు. వాహనదారులు, గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, హెల్మెట్ ధరించడం మరియు అతివేగాన్ని నియంత్రించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని ఎస్సై విజయభాస్కర్ సూచించారు.గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిధులు మరియు పంచాయతీ సిబ్బందితో కలిసి రోడ్డు భద్రత నియమాలను పాటిస్తామని ట్రాఫిక్ పోలీసులు ప్రతిజ్ఞ చేయించారు. గ్రామ ప్రజల విన్నపం మేరకు, రహదారి భద్రతలో భాగంగా గ్రామ సర్పంచ్ సహకారంతో రోడ్డుపై ఉన్న ప్రమాదకరమైన గుంతలను పూడ్చివేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎన్సాన్ పల్లి గ్రామ సర్పంచ్ నాగుల స్రవంతి ప్రశాంత్, ఉప సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ నరసింగరావు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ట్రాఫిక్ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.





