గురుకుల విద్యాలయాలలో, సంక్షేమ వసతి గృహాలలో వంట గదులను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ కే.హేమావతి ఆదేశించారు.
సిద్దిపేట్, ఏప్రిల్ 6, తెలుగు న్యూస్ 24/7
గురుకుల విద్యాలయాలలో, సంక్షేమ వసతి గృహాలలో వంట గదులను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ కే.హేమావతి ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టర్ రంగదాంపల్లి లో గల మైనార్టీ రెసిడెన్షియల్ స్కూలు ఆకస్మికంగా సందర్శించి వంటగదిని పరిశీలించారు. విద్యార్థుల కోసం చేస్తున్న వంటలను పరిశీలించి గ్యాస్ ను వృధా చేయకుండా పొదుపుగా వాడి పంటలను వేడివేడిగా విద్యార్థులకు పండించాలని అన్నారు. విద్యార్థులు అన్నం తినక ముందు అన్నం తిన్న తర్వాత డైనింగ్ రూమ్ లను శుభ్రం చేయాలని, వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ కూరగాయలు, ఆకుకూరలు జాగ్రత్తగా అపరిశుభ్రమైన ప్రాంతాలలోనే శుభ్రం చేసి వంటకు ఉపయోగించాలని ప్రిన్సిపాల్ ను, వంట సిబ్బందిని ఆదేశించారు.
.





