మంచిర్యాల జిల్లా పూసల సంఘం కమిటీని సన్మానించిన,మంచిర్యాల మండల కమిటీ.
మంచిర్యాల గాంధీ నగర్ పూసల కుల భవన్ వద్దా జిల్లా నూతన కమిటీని మండల అధ్యక్షులు కావిటి రాజు ఆధ్వర్యంలో జిల్లా కమిటీని సన్మానం కార్యక్రమం జరిగినది. అధ్యక్షులు సేని తిరుపతి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో పూసల కులస్తులకు బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించడంలో ముందుంటానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కులస్తులు సన్మానం కార్యక్రమం జరిగినది. ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, కోశాధికారి పసులోటి ఆంజనేయులు, ఉపాధ్యక్షులు పట్టెం సారయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ సేని రవి, మండల కమిటీ ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కావిటి రాజు, ప్రధాన కార్యదర్శి పసుపులోటి రమేష్, నాయిని వెంకటేశం, ఉపాధ్యక్షులు నాదిశెట్టి నాగయ్య, క్యాషియర్ సంయుక్త కార్యదర్శి సేనీ సాయి, పసుపులోటి స్వామి, ఉపాధ్యక్షులు మండల కులస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.





