దోపిడి దొంగలు అరెస్టు
సిద్దిపేట్, ఏప్రిల్ 4, తెలుగు న్యూస్ 24/7
సిద్దిపేట్ మార్చి 29 రోజున రాత్రి అందాద 9.30గంటలకు కేసీఆర్ నగర్ డబుల్ బెడ్ రూమ్ నకు చెందిన బల్ల సదానందం అను వ్యక్తి డబుల్ బెడ్ రూమ్ సమీపంలోని కల్లు కాంపౌండ్ దగ్గర నుండి నడుచుకుంటూ తన ఇంటికి వెళ్తుండగా మధ్యలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కలిసి మద్యం తాగుదామని తీసుకెళ్లి ఎవరూ లేని ప్రదేశంలో తనను చేతులతో కొట్టి తన వద్దనున్న సెల్ ఫోను, 500 రూపాయలు మరియు కాలికి ఉన్న వెండి కడియం ను గుంజుకుని పోయినారని సదానందం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి ఈరోజు నిందితులు అగు అగుల్ల రాజు తండ్రి సత్తయ్య వయసు 44 సంవత్సరంలు, కులం వీరముష్టి, నివాసం డబుల్ బెడ్ రూమ్ కెసిఆర్ నగర్ మరియు సందమైన రాజు, తండ్రి రాములు వయసు 32 సంవత్సరంలు, కులం యాదవ నివాసం డబుల్ బెడ్ రూమ్ కేసీఆర్ నగర్ అను వారిని పట్టుకొని వారి వద్ద నుండి ఫిర్యాదు దారుని యొక్క సెల్ ఫోను మరియు వెండి స్వాధీన పరుచుకుని నిందితులను రిమాండు కు తరలించడం అయినది అని సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బి.ఉపేందర్ తెలియపరచడమైనది..





