ప్రాంతీయం

ట్విన్నింగ్ స్కూల్ విజిట్‌తో విద్యలో కొత్త దిశగా అడుగులు – మండల విద్యాధికారి వెంకటరాములు..

29 Views

ట్విన్నింగ్ స్కూల్ విజిట్‌తో విద్యలో కొత్త దిశగా అడుగులు – మండల విద్యాధికారి వెంకటరాములు..

మర్కుక్, మార్చి 26, తెలుగు న్యూస్ 24/7

మర్కుక్ మండల పరిధిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల అంగడి కిష్టాపూర్ పాఠశాల విద్యార్థులు అతిథి గా మర్కుక్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మర్కుక్ ఆతిథ్య పాఠశాలుగా ట్విన్నింగ్ స్కూల్ కార్యక్రమంలో భాగంగా గురువారం సందర్శించి అక్కడి విద్యా విధానాలు, బోధన పద్ధతులు, పాఠశాల నిర్వహణ గురించి పలు అంశాలను నేర్చుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి వెంకట్రాములు హజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్విన్నింగ్ స్కూల్ అనేది రెండు లేదా అంతకంటే ఎక్కువ పాఠశాలలు పరస్పరం అనుసంధానమై, బోధన విధానాలు, విద్యా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యకలాపాలను పంచుకుంటూ అభివృద్ధి సాధించే విధానమనీ ఇది విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, సామాజిక నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని పెంపొందించడానికి దోహదపడుతుందనీ అన్నారు.అనంతరం రెండు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశం & బాలకిషన్ లు మాట్లాడుతూ రెండు పాఠశాలలు పరస్పరం తమ అనుభవాలను పంచుకుంటూ, ఒకరికొకరు సహకరించుకుని విద్యా ప్రమాణాలను పెంచుకునే ప్రక్రియ అని విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. స్థానిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు లయన్ ప్రతినిధులు శ్రీనివాస్ రావు & రమణ రావు లు మాట్లాడుతూ రెండు పాఠశాలలు పరస్పర సహకారంతో జిల్లాకే ఆదర్శంగా నిలుస్తున్నాయని విద్యా నాణ్యతను పెంచడంలో ట్విన్నింగ్ స్కూల్ విధానం కీలక పాత్ర పోషిస్తుందని విద్యార్థులు ఈ సందర్శన ద్వారా కొత్త విషయాలు నేర్చుకుని ఆనందం వ్యక్తం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *