గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘం సర్వసభ్య సమావేశం.
శరవేగంగా శ్రీ కమలం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్మాణం పనులు
వాసవి మాత కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలి – మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి
దాదాపు 10 కోట్ల రూపాయల తో ఆలయ నిర్మాణం
గజ్వేల్, మార్చి 29, తెలుగు న్యూస్ 24/7
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఆర్యవైశ్య భవన్ వద్ద ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీ కమలం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ పనులను పరిశీలించిన అనంతరం వైశ్య భవన్లో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, మాజీ కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ సీ సంతోష్ మాట్లాడుతూ, ఆర్యవైశ్య కుల దైవం జగన్మాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కరుణాకటాక్షాలతో అందరూ బాగుండాలని కోరుకుంటూ, గత ప్రభుత్వం కేటాయించిన వైశ్య భవన్ స్థలంలో ఆర్యవైశ్యుల దాతల సహకారంతో, దాదాపు పది కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న శ్రీ కమలం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని త్వరలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, ఆలయ నిర్మాణానికి విరాళాలు ఇచ్చేవారు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని కోరారు, ఈ కార్యక్రమంలో నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ,2వ వార్డ్ కౌన్సిలర్ గోలి మమత సంతోష్,ఏ ఏం సి డైరెక్టర్ మహంకాళి శ్రీనివాస్, ఉప్పల శ్రీనివాస్, కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు సిద్ది బిక్షపతి, అత్తెల్లి శ్రీనివాస్, కైలాస ప్రభాకర్, సుర ఆంజనేయులు,మాజీ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్,ఎర్రం శ్రీనివాస్,తోట బిక్షపతి,ములుగు రంగయ్య, గుడాల రాధాకృష్ణ, ఉప్పల కృష్ణమూర్తి, అత్తెల్లి నాగేంద్రం, తదితరులు ఉన్నారు





