*అశ్లీల ఫోటోలు వీడియోలు ఎరా చూపి యువతను మోసం చేస్తున్న మరో 8 మంది సైబర్ నిందితులు అరెస్ట్ చేసిన బేగంపేట పోలీసులు*
*నిందితుల వివరాలు*
1. కుర్మ నవీన్ తండ్రి సాయిలు, వయస్సు 21 సంవత్సరంలు, వృత్తి విద్యార్థి.
2. చుంచనకోట మహేష్ గౌడ్ తండ్రి బాల్ రాజు గౌడ్, వయస్సు 24 సంవత్సరంలు, వృత్తి విద్యార్థి.
3. మల్లప్ప కార్తీక్ రెడ్డి తండ్రి రాజారెడ్డి, వయస్సు 23 సంవత్సరములు, వృత్తి వ్యాపారం.
4. శిలవేరి బిక్షపతి తండ్రి నర్సింలు, వయస్సు 22 సంవత్సరములు, వృత్తి వ్యవసాయం,
*పై నలుగురు నివాసం తిరుమలాపూర్ గ్రామం, మండలం దౌల్తాబాద్*
5. చింతకింది ప్రభాకర్ తండ్రి స్వామి, వయస్సు 20 సంవత్సరములు, వృత్తి విద్యార్థి.
6. అన్నా రెడ్డి శివప్రసాద్ రెడ్డి తండ్రి బ్రహ్మారెడ్డి, వయస్సు 21 సంవత్సరం, వృత్తి విద్యార్థి.
7. అన్నా రెడ్డి గారి శివకుమార్ రెడ్డి తండ్రి ప్రభాకర్ రెడ్డి, వయస్సు 20 సంవత్సరములు, వృత్తి విద్యార్థి.
8. అన్నా రెడ్డి కరుణాకర్ రెడ్డి తండ్రి జలంధర్ రెడ్డి, వయస్సు 22 సంవత్సరములు, వృత్తి ప్రైవేట్ జాబ్.
*పై నలుగురు నివాసం మహమ్మద్ షాపూర్ గ్రామం, మండలం దౌల్తాబాద్.*
*పై నిందితుల వద్ద నుండి రికవరీ చేసిన వాటి వివరాలు*
????11 మొబైల్ ఫోన్లు
???? 19 సిమ్ కార్డ్స్
???? 7 బ్యాంకు పాస్ బుక్స్
???? 7 ఏటీఎం కార్డ్స్
*ఈ సందర్భంగా గజ్వేల్ ఏసిపి రమేష్, తొగుట సీఐ కమలాకర్ మాట్లాడుతూ* ఇదే కేసులో తేదీ: 20-06-2023 వాడు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించడం జరిగింది. పత్రికా ముఖంగా ప్రజలకు తెలియపరచిన విషయము విధితమే.
పోలీస్ కమిషనర్ మేడం ఆదేశానుసారం కేసును మరింత లోతుగా పరిశోధన చేయాలని ఈ కేసులో ఎవరు ఉన్నా వదిలిపెట్టవద్దని సూచనల మేరకు తదుపరి కేసు పరిశోధనలో భాగంగా సీసీ కెమెరాల పుట్టేజి, మరియు టెక్నాలజీ ద్వారా పై 8 మంది నిందితులు సోషల్ మీడియాలో షేర్ చాట్ ద్వారా అమ్మాయిల పేర్లతో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి అశ్లీల ఫోటోలు, న్యూడ్ చార్ట్ ద్వారా యువకులకు పంపిస్తూ వారిని ఆకర్షించే విధంగా ప్రయత్నాలు చేసి యువకులు పంపించిన డబ్బులు తీసుకొని సెల్ స్విచ్ ఆఫ్ చేసి సైబర్ నేరాలకు పాల్పడ్డారు.
కేసు పరిశోధనలో భాగంగా తొగుట సిఐ కమలాకర్, బేగంపేట ఎస్ఐ అరుణ్, పోలీసు సిబ్బందితో కలిసి పై 8 నిందితులను అదుపులోకి





