భద్రగిరి మార్ట్ ప్రారంభించిన గవర్నర్
మార్చి 28, తెలుగు న్యూస్ 24/7
భద్రాచలం పర్యటనలో రాష్ట్ర గవర్నర్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసి భద్రగిరి మార్ట్‌ను ప్రారంభించారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ మార్ట్ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని గవర్నర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూడటంలో ఇటువంటి వినూత్న కార్యక్రమాలు దోహదపడతాయని మంత్రి తుమ్మల తెలిపారు. మార్ట్ ఏర్పాటులో ఐ టి డి ఏ, పీవో రాహుల్ కృషిని వారు అభినందించారు..





