అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవo
పాతమంచిర్యాలలోని అతిపురాతనమైన శ్రీ రామలింగేశ్వర ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో అంగరంగ వైభవంగా కనుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణమహోత్సవాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కుటుంబసభ్యులతో పాటు పాల్గొని సీతారాముల కల్యాణాన్ని తిలకించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాతమంచిర్యాల ఆలయ అభివృద్ధితో పాటు వెనుకబాటుకు గురైన పాతమంచిర్యాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ప్రజలందరూ సీతారాముల ఆశీర్వాదంతో సుఖసంతోషాలతో ఉండాలని కోరారు.
కళ్యాణం సందర్బంగా గోనె భాగ్యలక్ష్మి-శ్యామ్ సుందర్ రావు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తూముల నరేష్, ఆలయ ఛైర్మెన్ తూముల వెంకటేష్, చింతకింది మల్లయ్య, శంకరయ్య, వెంకట్రామయ్య, బొల్లం భీమయ్య, అష్టకల రాజేష్ శర్మ, పూరేళ్ల రాజన్న, సిద్ధం స్వామి, దేవేందర్, కుమార్, తిరుపతి, పారాయణం మహిళా సభ్యులు, హనుమాన్ స్వాములు, భక్తులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.





