
పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలి.
— బీఎస్పీ మండల అధ్యక్షులు గజ్జెల ప్రశాంత్
వీర్నపల్లి మండలంలో కురిసిన ఆకాల రాళ్ళ వర్షానికి పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరుపున ఆదుకోవాలని బహుజన సమాజ్ పార్టీ వీర్నపల్లి మండల అధ్యక్షులు గజ్జెల ప్రశాంత్ ప్రభుత్వాన్ని కోరారు.ఒక వైపు యాసంగి సీజన్ లో నీళ్ల కొరతతో సతమతమవుతున్న తరుణంలో ఇటీవల కురిసిన రాళ్ళ వర్షానికి రైతులకు అధిక నష్టం జరిగింది.అని అన్నారు.తక్షణమే ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి నష్ట పరిహారం కింద ఎకరానికి 30,000/- ఇచ్చి మండల రైతులను ఆదుకోవాలని ప్రశాంత్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో లింగంపల్లి శంకర్,దావ ఆంజనేయులు,గొర్రె రాజయ్య,నర్సయ్య,పోచయ్య, తదితరులు పాల్గొన్నారు.





