ప్రాంతీయం

అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేస్తే చర్యలు తప్పవు ఎస్సై…

22 Views

ముస్తాబాద్, మార్చి12 24/7న్యూస్ ప్రతినిధి):ఇటీవల గ్రామంలో జరిగిన వ్యక్తిగత ఘటనలు నేపథ్యంలో గ్రామాల వాట్స్ ప్ గ్రూపుల్లో వ్యక్తిగత సమస్యలు, పగలు, పట్టింపులు, ఆరోపణలు అలాగే రాజకీయ, మతపరమైన చర్చలు ప్రజలు చేయవద్దని ముస్తాబాద్ ఎస్సై సిహెచ్. గణేష్ పేర్కొన్నారు. ఈసందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ సందేశాలు, అపార్ధాలు, వివాదాలు శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందన్నారు. వాట్సాప్ గ్రూప్ లలో అడ్మిన్లు గ్రూప్ లో పోస్టుఅయ్యే సందేశాలను కచ్చితంగా పర్యవేక్షించాలి. అసభ్యకరమైన లేదా వివాద సందేశాలు గ్రూపుల్లో ఎవరైనా చేరవేసినట్లయితే వెంటనే గ్రూప్ అడ్మిన్ తొలగించాలని అడ్మిన్లు పర్యావేక్షణలో లోపించితే చట్టపరమైన చర్యలు తీసుకొనబడతాయి. ప్రజలందరూ సోషల్ మీడియాను బాధ్యతగా ఉపయోగించి గ్రామాలలో శాంతి సామరస్యాన్ని కాపాడాలని కోరారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *