ప్రాంతీయం

గోదావరిఖనిలో బైక్ దొంగతనం కేసు ఛేదన నిందితుడు అదుపులోకి, బైక్ స్వాధీనం

17 Views

రామగుండం పోలీస్ కమీషనరేట్

గోదావరిఖనిలో బైక్ దొంగతనం కేసు ఛేదన నిందితుడు అదుపులోకి, బైక్ స్వాధీనం

గోదావరిఖని ప్రాంతంలో జరిగిన బైక్ దొంగతనం కేసును పోలీసులు త్వరితగతిన ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకుని బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గోదావరిఖని హనుమాన్ నగర్‌కు చెందిన రేగుల వెంకటేష్ అనే వ్యక్తి పాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తేది 10-03-2026 రోజున ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో టిఫిన్ చేయడానికి లక్ష్మీ నగర్‌లోని మున్సిపల్ కాంప్లెక్స్ వద్దకు తన బండి నెంబర్ TS 22 5029 గల ఫ్యాషన్ ప్రో మోటార్ సైకిల్‌పై వెళ్లి, కాంప్లెక్స్ వెనుక భాగంలో బండిని పార్క్ చేసి టిఫిన్ చేయడానికి వెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత తిరిగి వచ్చి చూడగా, అక్కడ పార్క్ చేసిన బండి కనిపించకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా దొరకలేదు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు తన బండిని దొంగిలించారని రేగుల వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు అందుకున్న వెంటనే ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆదేశాల మేరకు ఎస్సై మనోహర్ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి వెళ్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. దర్యాప్తులో బైక్‌ను దొంగిలించిన వ్యక్తిని గుర్తించి అతనిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుండి బైక్‌ను రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై మనోహర్ వెల్లడించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *