ప్రాంతీయం

రోడ్డు నిబంధనలు పాటించి సురక్షితంగా ఇంటికి చేరాలి: సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను

55 Views

 

 

రోడ్డు నిబంధనలు పాటించి సురక్షితంగా ఇంటికి చేరాలి: సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను

సిద్దిపేట జిల్లా, జనవరి 18, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘అరైవ్ అలైవ్’ (అరైవ్ అలైవ్ ) కార్యక్రమంలో భాగంగా ఆదివారం నారాయణరావుపేట మండల కేంద్రంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను,సిద్దిపేట రూరల్ ఎస్ఐ రాజేష్, ఈ కార్యక్రమంలో పాల్గొని వాహనదారులకు రోడ్డు నిబంధనలపై దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా సిద్దిపేట రూరల్ సిఐ శ్రీను, మాట్లాడుతూ. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని, ఇది ప్రమాద సమయంలో ప్రాణరక్షణ కవచంలా పనిచేస్తుందని సీఐ శ్రీను, పేర్కొన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేసిన వారవుతారని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసులకు సహకరించి ప్రమాద రహిత సిద్దిపేట జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.సిద్దిపేట్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజేష్, మాట్లాడుతూ.గ్రామీణ రోడ్లపై అతివేగంతో వెళ్లడం, ఓవర్‌లోడింగ్‌తో ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని, ఒకవేళ మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే  తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రాజేష్, హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది, వాహనదారులు గ్రామస్థులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *