ప్రాంతీయం

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.

6 Views

మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆదేశాల మేరకు బుధవారం సీఎం రిలీఫ్ ఫండ్ దౌల్తాబాద్ బీజేపీ మండల అధ్యక్షులు దేవుడి లావణ్య నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఇందుప్రియల్ గ్రామంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇందుప్రియల్ గ్రామానికి చెందిన కాసులవాడ దివ్యకు 12,000 వేలు, కడారి స్వామికి 44,500 వేలు, అలాగే సూరంపల్లి గ్రామానికి చెందిన దాసరి పెద్ద నరసయ్యకు 12,000 వేలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేదలు, ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అర్హులైన వారికి సహాయం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్రం ఇంచార్జ్ గడ్డం స్వామి, ఎన్ఎస్ నరసింహులు, మాజీ సర్పంచ్ సురేందర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ బొల్లం స్వామి, బూత్ అధ్యక్షులు కుమార్, శివకుమార్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *