ప్రాంతీయం

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా చెన్నూరులో స్పెషలిస్ట్ వైద్యులు తో వైద్య శిబిరం

11 Views

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా చెన్నూరులో స్పెషలిస్ట్ వైద్యులు తో వైద్య శిబిరం.

మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం.

ఈరోజు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా చెన్నూరు మండలంలోని అంగరాజుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్పెషలిస్ట్ వైద్యులు తో వైద్య శిబిరం ను నిర్వహించడం జరిగినది. ఈ శిబిరమును స్థానిక సర్పంచ్ రాజమణి ఉప సర్పంచ్ వసంత్ శ్యాంసుందర్ మరియు ముఖ్యఅతిథిగా జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సంచాలకులు డాక్టర్ వేదవ్యాస్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత  ఆధ్వర్యంలో వైద్య శిబిరమును నిర్వహించడం జరిగినది ఈ ప్రత్యేక వైద్య శిబిరంలో డాక్టర్ పల్లవి డాక్టర్ ప్రీతి డాక్టర్ ప్రతాప్ డాక్టర్ సునీల్ రావు డాక్టర్ కళ్యాణ్ డాక్టర్ లక్ష్మీ సాయి స్పెషలిస్ట్ వైద్యులు ముఖ్యంగా మాతా శిశు సంరక్షణ జనరల్ ఫిజీషియన్ ఆర్థోపెడిక్ కంటికి సంబంధించిన దంతాలకు సంబంధించిన ఎముకలకు సంబంధించిన వైద్య నిపుణులతో వైద్య శిబిరమును చేయడం జరిగినది. ఈ శిబిరం ను డాక్టర్ కృష్ణ తేజ వైద్యాధికారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరమును నిర్వహించడం జరిగినది. ఈ శిబిరంలో స్వచ్ఛందంగా ప్రజలు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవల పైన సంతృప్తి వ్యక్తం చేసినారు అదేవిధంగా 99 రోజులపాటు ఈ కార్యక్రమాలను అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆసుపత్రులలో ఆర్బీఎస్కే సిబ్బంది ద్వారా స్పెషలిస్ట్ వైద్యుల ద్వారా రెసిడెన్షియల్ పాఠశాలలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అదే విధంగా వివరములను ఆన్లైన్ ప్రోటల్ నమోదు చేయడం జరిగినది రిఫరల్ కేసులను జిల్లా ప్రభుత్వాసుపత్రికి పంపడం వారికి తగిన చికిత్సలు అందించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా అవగాహన కార్యక్రమాలు మరియు చికిత్సలు ప్రజల దగ్గరికి చేరవేయడం జరుగుతుంది.

ఈ కార్యక్రమంలో డిపిఓ ప్రశాంతి భాగ్య డిపిహెచ్ఎల్ ఆర్ఎస్ పద్మ అమూల్య దిశా కోఆర్డినేటర్ నీలిమ వారి సిబ్బంది హెచ్ఐవి ఎయిడ్స్ సిబ్బంది సబ్మిట్ అధికారి శ్రీనివాస్ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన బాలు కళావతి మరియు ఆరోగ్య ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్యవంతం చేయడము అదేవిధంగా ఈ 99 రోజులలో వచ్చే ఆరోగ్య కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *