ప్రాంతీయం

రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం బీసీలకు 60 వేల కోట్లు కేటాయించి, బీసీ సబ్ ప్లాన్ ను అమలు చేయాలి…

15 Views
ముస్తాబాద్, ఫిబ్రవరి 28 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతి సమీపంలోని తెలంగాణతల్లి విగ్రహంవద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీలంస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్ లో బీసీలకు 60 వేల కోట్లు కేటాయించాలని, అదేవిధంగా బీసీ సబ్ ప్లాన్ ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలలో భాగంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట సభను నిర్వహించి పార్టీ అధికారంలోకి రాగానే బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని అందులో బీసీలకు 42.శాతం రిజర్వేషన్లుకల్పించి అమలు చేస్తామని చెప్పిందని అలాగే ప్రతి ఏటా రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు 20.వేల కోట్లు కేటాయించి ఐదు సంవత్సరాలలో బీసీలకు 1.లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించి బీసీలకు అన్నిరకాల న్యాయం చేస్తామని తెలిపి అధికారంలోకి రాగానే ప్రథమ సంవత్సరం బడ్జెట్ లో 9.వేలకోట్లు కేటాయించి అందులో కేవలం 5.వేల కోట్లు ఖర్చు చేసిందని తర్వాత సంవత్సరంలో 11.వేల కోట్లు కేటాయించి అట్టి దానిని కూడా పూర్తిగా కర్చుచేయడంలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాకముందు ఇస్తానన్న విధంగా బీసీలకు బాకీ ఉన్న డబ్బులను కలుపుకొని ఈసారి బడ్జెట్లో 60.వేలకోట్లు కేటాయించాలని అలాగే కేటాయింపు డబ్బులు అంకెలకే పరిమితం కాకుండా 60.శాతం ఉన్న బీసీ జనాభాకు అభివృద్ధి సంక్షేమం కొరకు పూర్తిస్థాయిలో ఖర్చుచేయాలన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీల అభివృద్ధి కొరకు చిత్తశుద్ధితో ఉంటే మాట ఇచ్చినట్టుగా బడ్జెట్ ను కేటాయించి బీసీ స్టడీ సర్కిల్ లు కొత్తబీసీ గురుకులాలు ప్రత్యేక బీసీ పాఠశాలలు, బీసీ కులవృత్తుల కార్పొరేషన్లు, బీసీ కులవృత్తుల పథకాలు, బీసీ ప్రోత్సాహకాలు అందించాలని పల్లెలల్లో పట్టణాలలో బీసీ ఐక్యత భవనాలు కట్టించాలని నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలు చూపాలని లేనిపక్షంలో ప్రభుత్వంపై బీసీ మేధావులు, నిరుద్యోగులు, కార్మికులు, రైతులు అందరూ కూడా ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు జాల బిక్షపతి, పుల్లూరి రవి, బద్ద వెంకటి, మోతే నర్సింలు, బద్ద నాంపెల్లి, నీరటి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
కస్తూరి వెంకటరెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్ 9618419111

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *