భద్రాచలంలో సీతారాముల కళ్యాణంలో గోటితో ఓలిచిన వడ్లనే వాడడం ఆనవాయితీ. యంత్రాలను వాడరు. ఈ గోటి తలంబ్రాల కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సంస్థకు 4వ సారి చోటు కల్పించి 3క్వింటాల్ల వడ్లను రామకోటి రామారాజు భక్తికి మెచ్చి అందజేశారు. మంగళవారం నాడు ప్రజ్ఞాపూర్ పార్తివేశ్వర స్వామి దేవాలయంలో గజ్వేల్ ఏసీపీ నర్సింలు వడ్లకు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, గ్రామాన తిరిగి లక్షల మంది భక్తులచే రామనామ స్మరణ చేయించి గోటితో వడ్లను ఓలిపించి భక్తితో 3సార్లు కల్యానానికి అందించడం హర్షనీయం అన్నారు. 4వ సారి 3క్వింటాళ్లు అందించాలన్న రామకోటి రామరాజు దృఢ సంకల్పం గొప్పదన్నారు. గోటి తలంబ్రాలు అందజేసే బృహత్తర కార్యక్రమం చేబట్టి పలువురుకు ఆదర్శంగా నిలుస్తున్న రామకోటి రామరాజును అభినందించారు. సామాజిక సమరసత రాష్ట్ర అధ్యక్షులు ఆకుల నరేష్ బాబు మాట్లాడుతూ గోటి తలంబ్రాల కార్యక్రమంలో మమ్మల్ని బాగా స్వాములుగా చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మ శ్రీను, ప్రొద్దుటూరి భాస్కర్, టెంటు నర్సింలు, నంగునూరి సత్యనారాయణ, ఉమేష్ పాల్గొన్నారు.





