Breaking News

కెసిఆర్ జన్మదిన సందర్బంగా రోగులకు పండ్లు పంపిణి.

59 Views

తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించామని బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, నాయకులు రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. మంగళవారం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రాయపోల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. వడ్డేపల్లి గ్రామంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర చారిత్రాత్మకమని, ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు గ్రామీణ స్థాయికి చేరి ప్రజలకు మేలు చేశాయని పేర్కొన్నారు. ఆయన ఆలోచనల దిశగా కార్యకర్తలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కెసిఆర్ దీర్ఘాయుష్షుతో ప్రజా సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు నరసింహారెడ్డి, స్థానిక సర్పంచ్ మాసంపల్లి రాజు, ఉప సర్పంచ్ రాజు, రాష్ట్ర యువజన విభాగం నాయకులు రాజిరెడ్డి, సీనియర్ నాయకులు రంగారెడ్డి, జీవన్ రెడ్డి, వార్డు సభ్యులు పరశురాములు, నాయకులు నవీన్ గౌడ్, కనకయ్య, అక్బర్, దయాకర్ రెడ్డి, శ్రావణ్, యాదగిరి, శ్రీనివాస్, లింగం, బిక్షపతి, వెంకటేష్, వీరేశం, నాగరాజు గౌడ్, కనకరాజు, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *