ప్రాంతీయం

కలెక్టరేట్ కార్యాలయంలో దొడ్డి కొమురయ్యకు ఘనంగా నివాళులు…

125 Views

ముస్తాబాద్, ప్రతినిధి జూలై 4, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరెట్ కార్యాలయంలో దొడ్డి కొమురయ్య 77.వ వర్ధంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కురుమ సంగం నాయకులు మాట్లాడుతూ జమిందారీ భూస్వామ్య వ్యవస్థపై ప్రజలలో చైతన్యం రగిలించి భూమికోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఉద్యమంగా పోరాడిన మహా యోధులు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కొమురయ్య త్యాగాలను స్మరించుకుంటూ ఆయన పోరాట పటిమ ఎందరికో స్ఫూర్తినిచ్చిందని, తెలంగాణ ఉద్యమం రెండో దశలోనూ కొనసాగిందని అన్నారు. ఈకార్యక్రమంలో ముస్తాబాద్ కురుమ సంఘ సభ్యులు జిగిరి మల్లయ్య, శీల తిరుపతి, కోడె శ్రీనివాస్, శీల ప్రశాంత్, కర్రె మైసయ్య తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *