ప్రాంతీయం

జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడలను విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలి

38 Views

జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడలను విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అబ్దుల్ అమీద్ అధికారులను ఆదేశించారు…

సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 6, తెలుగు న్యూస్ 24/7 

జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడలను విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అబ్దుల్ అమీద్ అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్లో క్రీడలు యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సంబంధిత శాఖలఅధికారులతోసమావేశం నిర్వహించి జిల్లాలో జిల్లా స్థాయి సీఎం కప్పు క్రీడల నిర్వహణపై సమీక్షించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 12, 13, 14 తేదీలలో జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లాస్థాయి సీఎం క్రీడా పోటీల నిర్వహించడం జరుగుతుందని ఈ క్రీడలలో డివిజన్ స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఎంపికైన దాదాపు 7 వేలకు పైగా క్రీడాకారులు కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్, ఫుట్బాల్, బ్యాట్మెంటన్, అథ్లెటిక్స్, యోగా, క్యారం, చెస్, కరాటే, బేస్బాల్, బాక్సింగ్, సైక్లింగ్,స్విమ్మింగ్,హాకీతదితర25క్రీడాంశాలలోపాల్గొననున్నారని తెలిపారు. జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలకు పంపించడం జరుగుతుందని అన్నారు. జిల్లాస్థాయి పోటీల నిర్వహణకు వివిధ శాఖలకు విధులను అప్పజెప్పడం జరిగిందని వాటిని సక్రమంగా నిర్వహించి క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్రీడలు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాటు చేయాలని అన్నారు. ముఖ్యంగా 3 రోజుల పాటు క్రీడలు జరగనున్నందున క్రీడలు నిర్వహించే ప్రదేశంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు, గ్రౌండ్ ప్రిపరేషన్, విద్యుత్ సౌకర్యం, త్రాగునీరు, క్రీడాకారులకు భోజనం వసతి, మెడికల్ క్యాంపు, ఏర్పాటు చేయాలని. పోటీలు నిర్వహించేందుకు ఫిజికల్ డైరెక్టరు ఇతర సిబ్బందిని నియమించాలని అన్నారు. గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి వెంకట నరసయ్య, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, డీఈవో శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి తనూజ, డిపిఆర్ఓ రవికుమార్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ భూపాల్, ఎస్సి డిఓ హమీద్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి గణేష్, డిస్టిక్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, జడ్పీ డిప్యూటీ సీఈవో, డివిజనల్ పంచాయతీ అధికారి తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *