ప్రాంతీయం

ఫిబ్రవరి 11 వ తేదీ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు పబ్లిక్ హాలిడే…

110 Views

ఫిబ్రవరి 11 వ తేదీ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు పబ్లిక్ హాలిడే…

జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె. హైమావతి…

సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 6, తెలుగు న్యూస్ 24/7 

2 వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికలు నిర్వహించనున్న మున్సిపాలిటీల ప్రాంతాల్లో ఓటర్ల సౌకర్యార్థం ఎన్నికల పోలింగ్ రోజు ఫిబ్రవరి 11 వ తేదీ నాడు సెలవులను ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె. హైమావతి ఒక ప్రకటనలలో తెలిపారు.ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికలు జరుగనున్న జిల్లాలోని హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల, గజ్వెల్ -ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీల పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు పబ్లిక్ హాలిడే ను అమలుచేయడంజరుగుతుందనిప్రభుత్వ,ప్రైవేట్,సంస్థలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వాళ్ల ఓటు హక్కునుసద్వినియోగం చేసుకునేలా వేతనంతో కూడిన సెలవు మంజూరు చేసేలా ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. అలాగే ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్న అన్ని భవనాలు/ సంస్థలకు 10వ తేదీన కూడా సెలవును ప్రకటించడం జరిగిందని తెలిపారు.అదేవిధంగా ఓట్ల లెక్కింపు కోసం వినియోగించే ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, భవనాలకు ఓట్ల లెక్కింపుకు ముందురోజు గురువారం ఫిబ్రవరి12 నాడు ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 13 శుక్రవారం నాడు మొత్తం 2 రోజులు లోకల్ హాలిడే వర్తింపజేయబడుతుందని అన్నారు. జిల్లాలోఎన్నికలుజరగనున్న4మున్సిపాలిటీలలో ఓటు హక్కును కలిగి ఉండి జిల్లాలోని ఇతర ప్రాంతాలలో గల ప్రభుత్వ, ప్రవేట్ కార్యాలయాలలో, సంస్థలలో విధులు నిర్వహిస్తున్నవళ్ళుకూడాఓటుహక్కును,వినియోగించుకునేందుకు వాళ్ల కి కూడా సెలవు వర్తిస్తదని తెలిపారు.  నెగోషియబుల్ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1981 ప్రకారం ఎన్నికలు జరగనున్న జిల్లాలోని 4 మున్సిపాలిటీల పరిధిలో గల బ్యాంకులకు కూడాసెలవువర్తిస్తదనితెలిపారు.ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఓటర్లుగా నమోదైన ప్రతి ఒక్కరూ తప్పకుండా తమతమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *