*ఫిబ్రవరి 12,న జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని,కేంద్రానికి తగిన బుద్ధి చెప్పాలి*
*కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న మోడీ ప్రభుత్వం*
*పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప*
ఆసిఫాబాద్ జిల్లా.
*కేంద్ర కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ సమావేశం కుమురం భీం జిల్లాలోని CITU కార్యాలయంలో జరిగింది,ఈ సందర్భంగా AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్,సిఐటియు జిల్లా కార్యదర్శి J. రాజేందర్,TUCI జిల్లా కార్యదర్శి G. తిరుపతి, IFTU నాయకులు J. తిరుపతి మాట్లాడుతూ* 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను అమల్లోకి తెస్తూ 2025 నవంబర్ 21న ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేయాలని, వారు డిమాండ్ చేసారు,అలాగే విద్యుత్ సవరణ చట్టం ఉప సంహరించుకోవాలి, పేదలకు పనికి గ్యారంటీ కల్పిస్తున్న MGNREGA చట్టాన్ని కొనసాగించాలని తదితర డిమాండ్ల పరిష్కారానికై జాతీయ కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు ఇచ్చిన పిలుపుపై 2026 ఫిబ్రవరి 12న జరుగనున్న ఒక్క రోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కుమురం భీం జిల్లాలో సంఘటిత, అసంఘటిత కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
నాలుగు లేబర్ కోడ్లు మరియు నిబంధనలను రద్దు చేయాలి, జిల్లాలోని సింగరేణి,ఆర్టీసీ,సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికులతో పాటు స్కీం వర్కర్లు గ్రామపంచాయతీ,మున్సిపాలిటీ ఎన్హెచ్ఎం,హెల్త్ డిపార్ట్మెంట్ తోపాటు ఇతర అన్ని రకాల కార్మికులు స్వచ్ఛంద పాల్గొనాలని* NHMలోని అల్ క్యాడేర్స్ ను & స్కీం వర్కర్లను రెగ్యులర్ వర్కర్లుగా గుర్తించాలి. 45, 46వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసులను అమలు చేయాలి. స్కీమ్ కార్మికుల కోసం పే కమీషను నియమించాలి.రెగ్యులర్ చేసే వరకు నెలకు రూ.26,000/-లు స్థిర కనీస వేతనం మరియు రూ.10,000/-లు పెన్షన్ చెల్లించాలి. పని గంటలను ఎనిమిది గంటలకు పరిమితం చేయాలి మరియు పనిభారాన్ని తగ్గించాలి. దేశవ్యాప్తంగా ఒకే విధమైన పని పరిస్థితులు అమలులోకి తేవాలి. వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, 20 రోజుల క్యాజువల్ సెలవులు మరియు వేతనంతో కూడిన మెడికల్ సెలవులను నిర్ణయించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ ప్రకటించే వరకు పదవీ విరమణ ఉండరాదు. సీనియారిటీ ప్రాతిపదికన ఆశా వర్కర్లను ఎ.ఎన్. ఎం పోస్టుల్లో పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు.





