ప్రాంతీయం

సిట్ నోటీసులు కక్ష సాధింపే 

119 Views

సిట్ నోటీసులు కక్ష సాధింపే

రాష్ట్ర సాధకుడికి నోటీసులు అంటించి అవమాన పరుస్తారా?

సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మని దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు 

సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 1, తెలుగు న్యూస్ 24/7

మండలకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని సిట్ విచారణ కు పిలిచినందుకు నిరసనగా భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి, ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేసి, సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మని దగ్ధం చేశారు. బొగ్గు కుంభకోణం, జల దోపిడి పై బీఆర్ఎస్ చేస్తున్న పోరాటాన్ని తట్టుకోలేకే కుట్రలు పన్నుతూ, తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ పై రేవంత్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం తగదని, కెసిఆర్ గారి ఇంటికి నోటీసులు అంటించి అవమానిస్తున్నారు అని రాష్ట్రంలో ఉన్నది సర్కారు కాదని, సర్కస్ నడిపిస్తున్నారని, కేసీఆర్ గారిపై సిట్ విచారణ పేరిట రాక్షస ఆనందం పొందుతున్నాడని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నామని,రెండేండ్ల తర్వాత వచ్చేది కేసీఆర్ ప్రభుత్వం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బొల్లం శ్రీధర్ పెద్దన్న, తాల్లపెల్లిభీమయ్య, బిగుళ్ళ మోహన్,నాయకులు చింతకింది శ్రీనివాస్ గుప్తా,కనగండ్ల తిరుపతి,బోయినపల్లి శ్రీనివాస్ రావు, నరేష్ పటేలు,దుంబల రాజా మహేందర్ రెడ్డి,ఎల శేఖర్ బాబు, ముక్కిస తిరుపతి రెడ్డి, చిలకల తిరుపతిరెడ్డి, ఉప సర్పంచ్ మహేష్, హరీష్, కవ్వంపల్లి శ్రీనివాస్, రమేష్ బండి పెళ్లి,లింగాల వెంకటేష్, రామంచ పరశురాం, గణపురం తిరుపతి, పొట్లపల్లి శివ, ఎలుక దేవయ్య, బోడబట్ల తిరుపతి, నరసింహారెడ్డి, రామ్ రెడ్డి, కిష్టయ్య,దేవరాజు, తిరుపతి శేఖర్,తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *