ప్రాంతీయం

పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

12 Views

*రామగుండం పోలీస్ కమిషనరేట్*

*రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు, పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.*

*పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా.*

*నిరంతరం చట్టబద్ధంగా, నిబద్ధతతో, ధైర్యంగా, క్రమశిక్షణతో సమర్థవంతంగా విధులు నిర్వహించాలి.*

ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, పోలీసులు నిరంతరం చట్టాన్ని గౌరవిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు.భారత రాజ్యాంగం ద్వారా దేశ పౌరులకు సమానత్వం,స్వేచ్ఛ, న్యాయం వంటి మౌలిక విలువలు లభించాయని తెలిపారు.ప్రజల భద్రత మరియు శాంతిభద్రతల పరిరక్షణ పోలీస్ శాఖ యొక్క ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. చట్టాలను గౌరవిస్తూ, సామాజిక బాధ్యతతో ప్రతి పౌరుడు మెలగాలని సూచించారు.

మన రాజ్యాంగం అందించిన స్ఫూర్తితో ఈరోజు మనం స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు.ప్రతి భారతీయుడి హృదయంలో గణతంత్ర దినోత్సవం ఒక ప్రత్యేకమైన దినమని అన్నారు. ఎందరో త్యాగధనుల త్యాగఫలితమే గణతంత్ర దినోత్సవమని,వారి ప్రాణత్యాగాల వల్లనే మనం ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నామని తెలిపారు.అలాంటి మహనీయులను ఎప్పటికీ స్మరించుకోవాలని అన్నారు.

*పోలీసు విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు మరియు సిబ్బందికి సీపీ  స్వహస్తాలతో ప్రశంసాపత్రాలు అందజేశారు.*

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ కె.శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, ఏసీపీ స్పెషల్ బ్రాంచ్ నాగేంద్రగౌడ్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు, వివిధ ఇన్స్పెక్టర్లు,ఏఓ శ్రీనివాస్,సీఐలు, ఆర్‌ఐలు,ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు,వివిధ వింగ్స్ సిబ్బంది,సీపీఓ సిబ్బంది,సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *