ప్రాంతీయం

వడ్లూరు గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలుపాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

37 Views

వడ్లూరు గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలుపాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

సిద్దిపేట జిల్లా, జనవరి, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వడ్లూరు గ్రామంలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వసంత పంచమి సందర్భంగా బెజ్జంకి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ మెంబర్స్ చెన్నడి సుధాకర్ రెడ్డి, అన్నాడి ఆనంతరెడ్డి, రాసూరి మల్లికార్జున్ విద్యార్థులకు నోట్ బుక్స్ ఉచితంగా పంపిణీ చేయడం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందస్తుగా ఉపాధ్యాయులకు విద్యార్థులకు వసంత పంచమి శుభాకాంక్షలు తెలిపి,వసంత పంచమి రోజున సరస్వతి దేవి జన్మించిన రోజుగా భావిస్తారని,అందుకే ఈరోజు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉందని, సరస్వతి దేవి ఆశీస్సులతో, విద్య జ్ఞానం విజయం నిత్యం మీ వెంట నడవాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పులి రమేష గౌడ్ జెడ్ పి హెచ్ ఎస్ వడ్లూర్ బేగంపేట పాఠశాల కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు గోపి కృష్ణ, ఎం పి పి సి వడ్లూర్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ ,ఉపాధ్యాయురాలు రూప,పులి సంతోష్, కుక్కల రాములు ఉప సర్పంచ్ బెజ్జంకి మరియ అనిల్ కుమార్, వార్డు సభ్యులు మంకాల స్వామి ,పులి శ్రీకాంత్, మంకాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *