ప్రాంతీయం

ఒక్క రోడ్డు ప్రమాదం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది

20 Views

అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ ప్రోగ్రాం

ఒక్క రోడ్డు ప్రమాదం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది

సిద్దిపేట జిల్లా,జనవరి 23, తెలుగు న్యూస్ 24/7 

కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేట ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అర్రైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ ప్రోగ్రాం లో భాగంగా అరవింద్ పటేల్, మేనేజర్ దేశాయ్ బీడీ కంపెనీ కార్మికులకు ఉద్యోగులకు రోడ్ సేఫ్టీ కార్యక్రమం నిర్వహించిన సిద్ధిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, సిద్ధిపేట వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్,మాట్లాడుతూ వాహనాలు దారులు అందరు కచ్చితంగా హెల్మెట్ ధరించవలెను, బెల్ట్ ధరించవలెనని అతివేగంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దని, మద్యం సేవించి వివాహనాలు నడపకూడదని ఒకవేళ మద్యం సేవించి ఈ వాహనాలు నడుపుతూ పట్టుపడితే పదివేల రూపాయల జరిమానా విధించబడుతుందని రెండవసారి కూడా మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష కూడా విధించబడుతుందని చెప్పడం జరిగింది, రోడ్డుపైన వాహనాలు నడిపేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి యాక్సిడెంట్ గురైతే వాళ్ల కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయం గురించి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా సిద్ధిపేట వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు మాట్లాడుతూ.రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని తెలిపారు. హైవే రోడ్డుపై ఉన్నందున రోడ్డు దాటేటప్పుడు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒక రోడ్డు ప్రమాదం కుటుంబాన్ని మానసికంగా శారీరకంగా ఆర్థికంగాకృంగదీస్తుందన్నారు. మానవ తప్పిదం వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అందరము కలిసికట్టుగా పనిచేయవలసి ఉందన్నారు.కావున ప్రతి ఒక్కరు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు వహిస్తూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. అలాగే అందరూ కలిసి రోడ్ సేఫ్టీ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *