ప్రజా సంక్షేమం కోసం సర్పంచ్ లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి,జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు.
మంచిర్యాల జిల్లా,జనవరి 23, 2026:
గ్రామస్థాయిలో ప్రజల సంక్షేమం కోసం నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు అన్నారు. శుక్రవారం జిల్లాలోని హాజీపూర్ మండలం ముల్కల్ల లో గల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో నూతన సర్పంచ్ లకు నిర్వహిస్తున్న తొలి దశ శిక్షణ ముగింపు కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్, అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తొలి దశలో 101 మందికి 5 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ శిక్షణలో చెన్నూర్, జైపూర్, హాజీపూర్, లక్షెట్టిపేట, భీమారం, మందమర్రి మండలాలకు చెందిన సర్పంచ్ లకు శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. తెలంగాణ గ్రామీణాభివృద్ధి శిక్షణా సంస్థ వారు రూపొందించిన కరదీపికలోని అన్ని అంశాలపై సుశిక్షితులైన మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ అందించడం జరిగిందని, సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేక అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. సర్పంచ్ లు శిక్షణలో నేర్చుకున్న అంశాలను ప్రజా శ్రేయస్సు దృష్ట్యా వినియోగించాలని తెలిపారు. అనంతరం శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి ధృవీకరణ పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి, మాస్టర్ ట్రైనర్, కొమ్మర సతీష్ కుమార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు మోహన్, సాయి వెంకట్ రెడ్డి, మండల పంచాయతీ అధికారులు శ్రీపతి బాపు రావు, వేదాల శ్రీనివాస్, బుగ్గరాం శ్రీనివాస్, సతీష్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, మాస్టర్ ట్రైనర్లు అనిల్ కుమార్, వెంకటేష్, మహేష్, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ నరేందర్, పంచాయతీ కార్యదర్శులు సుమన్, నరేందర్, నాగరాజు, జిల్లా పంచాయతీ కార్యాలయ సిబ్బంది వెంకటేష్, ప్రజ్ఞ, రాంకుమార్ తదితరులు పాల్గొన్నారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*





