ఈ నెల 19వ తేదీన ప్రజావాణి రద్దు,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల జిల్లా,జనవరి 18, 2026:
మున్సిపల్ ఎన్నికలు- 2026 పనులు, పలువురు రాష్ట్ర మంత్రుల పర్యటన దృష్ట్యా ఈ నెల 19వ తేదీ సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
*మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది*





