మైక్రో ఫైనాన్స్ ఆగడాలు ఆపేదెవరు
మంచిర్యాల, డిసెంబర్ 30.
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో హమలివాడ, తిలక్ నగర్, రాజీవ్ నగర్, గాంధీనగర్, ఎన్టీఆర్ కాలనీ ఏరియాలో మైక్రో ఫైనాన్స్ ఆగడాలు రోజురోజుకు మితిమీరి పోతున్నాయి. వివరాలకు వెళ్తే మైక్రో ఫైనాన్స్ నిరాహాకులు వచ్చి మహిళలకు ఎలాంటి షూరిటీ లేకుండా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ సిబిల్ ఉంటే చాలు ఆశ చూపి సిబిల్ ఉంటే 30000 వేలనుంచి 40 వేల వరకు ఇస్తామని ఆశ చూపి గ్రూపులో నలుగురు లేదా ఐదు ఉండాలని చెప్పి వారానికి వెయ్యి రూపాయల నుండి 1100 వందల వరకు కట్టవలసి ఉంటుందని చెప్పి వారం రోజుల తర్వాత వచ్చి ఎవరైతే మహిళా గ్రూపు సభ్యులు కొన్ని అనువారకరణ వల్ల కట్టలేని పరిస్థితి ఉంటే మహిళలు అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు లోను ఎందుకు తీసుకున్నావు కట్టలేని పరిస్థితి ఉంటే అని లోను కట్టవలసిందే లేకుంటే సాయంత్రం వరకైనా మీ ఇంటి వద్దనే ఉంటాం. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ నాన్న ఇబ్బందులు పెడుతున్నారు. మహిళలు కు ఏమి చేయాలో తెలియక క్షణి ఆవేశంలో ఆత్మహత్యలు చేసుకోబోయారు వారి అదృష్టం బాగుంది ప్రాణాల నుండి బయటపడ్డారు ఏది ఏమైనప్పటికీ సంబంధిత అధికారులు కానీ ప్రజాప్రతినిధులు గాని చొరవ చూపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.





