సిద్దిపేట జిల్లాలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి
సిద్దిపేట జిల్లా,జనవరి 17, తెలుగు న్యూస్ 24/7
రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక, హుస్నాబాద్, గజ్వెల్–ప్రజ్ఞాపూర్, చెర్యాల మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియను శనివారం ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ (ఐడీఓసీ), సిద్దిపేటలోని మినీ కాన్ఫరెన్స్ హాల్జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధ్యక్షతన, జిల్లాలోని ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రిజర్వేషన్ ప్రక్రియను నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి మున్సిపాలిటీలో 50 శాతం స్థానాలను మహిళలకు రిజర్వేషన్ కల్పించినట్లు తెలిపారు. మహిళా రిజర్వేషన్‌లను డ్రా పద్ధతిలో ఆయా పార్టీల ప్రతినిధుల సమక్షంలో పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొత్తం సజావుగా, ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి, సంబంధిత మున్సిపల్ కమిషనర్లు, ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.





