ప్రాంతీయం

సిద్దిపేట కలెక్టరేట్ లో తెలంగాణ తల్లి విగ్రహా ఆవిష్కరణ

95 Views

సిద్దిపేట కలెక్టరేట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ

-గనుల శాఖ మంత్రి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి గడ్డం వివేక్ వెంకటస్వామి.

సిద్దిపేట జిల్లా, జనవరి 13, తెలుగు న్యూస్ 24/7 

సిద్దిపేట కలెక్టరేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి గడ్డం వివేక్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. హైమావతి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్టీఏ కమిటీ సభ్యులు సూర్యవర్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, కలెక్టరేట్ సిబ్బంది, టిఎన్జిఓ నాయకులు, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహంలోనే తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు స్పష్టంగా ప్రజలకు కనపడుతున్నాయని అన్నారు. అందేశ్రీ రాసిన జయజయహే తెలంగాణ గీతం, తెలంగాణ తల్లి విగ్రహాలు తెలంగాణలో ప్రజా పాలనను ప్రజలకు తెలియజేస్తున్నాయని అన్నారు. ప్రజా పాలనలో ప్రజలు కోరుకున్న విధంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందిస్తుందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ లతో పాటుగా ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ తదితర అనేక అభివృద్ధి కార్యక్రమాలను పేద ప్రజల కోసం అమలు చేయిస్తున్నామని అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి గతంలో కొందరికి అందిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందేలా చర్యలు తీసుకుందామని అన్నారు. మంగళవారం దుబ్బాక పట్టణంలో 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని, నాంచారిపల్లి గ్రామంలో పది కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగిందని త్వరలోనే సిద్దిపేట పట్టణంలో 15 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని అన్నారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు వేగంగా చేరుకునేలా జిల్లా అధికార యంత్రంగా కృషి చేస్తుందని తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *