ప్రాంతీయం

రామగుండం కమిషనరేట్‌లో పేకాట, కోడిపందాలపై పటిష్ట నిఘా

25 Views

రామగుండం పోలీస్ కమిషనరేట్.

రామగుండం కమిషనరేట్‌లో పేకాట, కోడిపందాలపై పటిష్ట నిఘా

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి,మంచిర్యాల జోన్‌లలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ పరిధుల్లో పేకాట,కోడిపందాలు, ఇతర చట్టవ్యతిరేక మరియు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్  అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు.

అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు కమిషనరేట్ వ్యాప్తంగా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆకస్మిక వాహన తనిఖీలు, నాకాబందీలు నిర్వహించడంతో పాటు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో గుర్తించిన కీలక ప్రదేశాలలో సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేసినట్లు తెలిపారు.

అదేవిధంగా కమిషనరేట్ సరిహద్దు జిల్లాలు మరియు ఇతర రాష్ట్రాల్లోని పోలీస్ స్టేషన్‌లతో సమన్వయం ఏర్పాటుచేసి సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

పేకాట,కోడిపందాలు లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100‌కు సమాచారం అందించాలని ప్రజలను ఆయన కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *